Home తాజా వార్తలు ప్రగతిభవన్ లో పంద్రాగస్టు వేడుకలు

ప్రగతిభవన్ లో పంద్రాగస్టు వేడుకలు

15th August Celebration in Pragathi Bhavanహైదరాబాద్‌, : ప్రగతి భవన్ లో శనివారం పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. తెలంగాణ సిఎం కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 20 మంది అతిథులు మాత్రమే పాల్గొన్నారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం, మండలిలో చైర్మన్ గుత్తా, సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ జెండావందనం చేశారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీల్లో కూడా పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.