Home అంతర్జాతీయ వార్తలు రెండు బస్సులు ఢీ: 16 మంది మృతి

రెండు బస్సులు ఢీ: 16 మంది మృతి

16 Members dead in Bus accident in Mexico

మెక్సికోలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ అరిజోనా ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో 16 మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన 14 మంది ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గోల్డ్ మైన్ కార్మికులు బస్సులో లుక్ విల్లే ప్రాంతం నుంచి నోచిబుయాన్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సోనారా అటార్నీ జనరల్ తెలిపాడు. 2015వ సంవత్సరంలో ట్రక్కు అదుపు తప్పి ఓ మతం వాళ్లు ఊరేగింపుగా వెళ్తుండగా…. వారిపైకి దూసుకెళ్లడంతో 27 మంది చనిపోగా 149 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.