Home జయశంకర్ భూపాలపల్లి 162 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

162 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

162 Quintals Ration Rice Seized

జయశంకర్ భూపాలపల్లి : ములుగు మండలం అబ్బాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బాణాలపల్లి గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 162 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రేషన్ బియ్యంతో ఉన్న లారీని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు.

162 Quintals  Ration Rice Seized