Home జాతీయ వార్తలు 16వ లోక్ సభను రద్దు చేస్తూ తీర్మానం….

16వ లోక్ సభను రద్దు చేస్తూ తీర్మానం….

Lok Sabha

 

ఢిల్లీ: కాసేపట్లో కేంద్రం మంత్రివర్గం సామావేశం కానుంది. పార్లమెంట్ ఎన్నికలలో బిజెపికి భారీ మెజార్టీ రావడంతో 16వ లోక్ సభను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం తీర్మానం చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పంపనున్నారు. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నట్టు సమాచారం. అనంతరం బిజెపి పార్టమెంటరీ బోర్డు సమావేశం కానుంది. పార్లమెంటరీ పార్టీ నేతను బిజెపి ఎంపిలు ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి మోడీ అధ్యక్షత వహించారు. నరేంద్ర మోడీ రెండో సారి ప్రధాన మంత్రి మే-26 ప్రమాణం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలలో ఎన్ డిఎ కూటమి 348 స్థానాలు గెలుచుకుంది. 

 

16th Lok Sabha Cancelled by Modi Cabinet