Home తాజా వార్తలు సైబరాబాద్‌లో ఆపరేషన్ స్మైల్

సైబరాబాద్‌లో ఆపరేషన్ స్మైల్

17 child laborers rescued by Operation Smile Team

హైదరాబాద్: వివిధ పనుల్లో వెట్టి చాకిరి చేస్తున్న బాల, బాలికలకు విముక్తి కల్పించారు. సైబరాబాద్ పోలీసులు ఆపరేషన్ స్మైల్‌లో 7లో భాగంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పనులు చేస్తున్న పిల్లలను కనిపెట్టి వారిని కాపాడారు. ఇందులో బాలకార్మికులు, భిక్షమెత్తుకునే వారు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, మిస్సింగ్ అయిన పిల్లలు, బ్యాంగిల్ తయారీ కంపెనీలో పనిచేస్తున్న 17మంది పిల్లలను కాపాడారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పిల్లలను కాపాడేందుకు ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా తొమ్మిది డివిజన్లలో పిల్లలను కాపాడుతున్నార. అందులోభాగంగా ఆపరేషన్ స్మైల్ 7ను ప్రారంభించారు. ఆపరేషన్ స్మైల్ టీం, చైల్డ్ లైన్ టీమ్ అధికారులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంగిల్ తయారీ కంపెనీలో పనిచేస్తున్న 17మంది పిల్లలకు విముక్తి కల్పించారు. బాలురను ఇంట్లో బంధించి వారితో పనిచేయిస్తున్నారు. బాలరకు తక్కువ వేతనాలు ఇవ్వడం, తిండి సరిగా పెట్టకపోవడం, ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నారు.

దీంతో చాలామంది బాలురు అనారోగ్యం బారినపడుతున్నారు. తక్కువ వేతనాలు ఇవ్వడమే కాకుండా వాటిని కూడా సరిగా ఇవ్వడంలేదు, అంతేకాకుండ రెండు మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. పనిచేస్తున్న బాలురుకు కనీసం మధ్యలో విరామం ఇవ్వకుండా రోజంతా పనిచేయిస్తున్నట్లు తెలిసింది. కాపాడిన బాలురను ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. బాలురతో దాదాపుగా 12గంటలు పనిచేయిస్తున్నారు. పిల్లలను చిన్న రూముల్లో ఉంచడమే కాకుండా వాటికి సరిగా వెలుతురు కూడా ఉండడంలేదు. పిల్లలకు కనీసం సెలవు కూడా ఇవ్వడంలేదు. దీంతో చాలామంది పిల్లలు బలహీనంగా తయారు కావడంతోపాటు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

పిల్లలతో పని చేయిస్తే ఫిర్యాదు చేయండి
పిల్లలతో ఎవరైనా పనిచేయిస్తే వెంటనే సైబరాబాద్ పోలీసుల వాట్సాప్ నంబర్ 7901115474కు ఫోన్ చేయాలని ఆపరేషన్ స్మైల్ ఫోలీసులు తెలిపారు. లేదా డయల్ 100, [email protected]కు సమాచారం ఇవ్వాలని కోరారు. 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలతో బాలకార్మికులుగా, హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, టీస్టాల్స్, ఇళ్లల్లో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పిల్లలతో పనులు చేయించే వారికి మూడేళ్ల వరకు శిక్షపడుతుందని తెలిపారు. పిల్లలతో భిక్షాటన చేయిస్తే వారి అడ్రస్ ఇస్తే కనిపెట్టి పునరావాస కేంద్రానికి తరలిస్తామన్నారు.

17 child laborers rescued by Operation Smile Team