Home Default దెయ్యం పట్టిందని.. పెండ తినిపించారు..!

దెయ్యం పట్టిందని.. పెండ తినిపించారు..!

Cow-Dung

లాతూర్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ 17 ఏళ్ల బాలికకు దెయ్యం పట్టిందని ఆమె చేత బర్రె పేడ తినిపించిన ఘటన మహారాష్ట్రలోని లాతూర్‌లో చోటు చేసుకుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెను డాక్టరుకు చూపించాల్సిందిపోయి.. తల్లిదండ్రులు ఆమెకు దెయ్యం పట్టిందని భూతవైద్యుల్ని ఆశ్రయించారు. బాలికకు దెయ్యం పట్టిందని, అందుకు చికిత్సగా ఆమె చేత బలవంతంగా బర్రె పెండ తినిపించారు. కాగా గత వారం జరిగిన ఈ ఉదంతం మీడియా ద్వారా బహిర్గతం కావడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.