Home జాతీయ వార్తలు భారత్ లో కొత్తగా 17,407 కరోనా కేసులు నమోదు

భారత్ లో కొత్తగా 17,407 కరోనా కేసులు నమోదు

17407 New Corona Cases Were Registered In Indiaఢిల్లీ : భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన ఒక్కరోజులో కొత్తగా 17,407  మంది కరోనా బారినపడినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం మీడియాకు తెలిపారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు చేరిందని వారు వెల్లడించారు.  గడిచిన ఒక్కరోజులో కరోనా నుంచి 14,031 మంది కోలుకున్నారని వారు పేర్కొన్నారు. గడిచిన ఒక్కరోజులో కరోనాతో 89 మంది చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 1,57,435కు చేరిందని వారు తెలిపారు. భారత్ లో ఇప్పటివరకు 1,08,26,075 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 1,73,413 మంది కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు  1,66,16,048 మందికి కరోనా టీకా వేసినట్టు వారు వెల్లడించారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని వారు ప్రజలను కోరారు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.