Thursday, April 25, 2024

రాష్ట్రంలో కొత్తగా 1,798 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1798 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,30,430 మందికి పరీక్షలు నిర్వహించగా 1,798 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మరో 14 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2,524 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 23,561 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,98,611 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా… 5,71,610 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 3,440కి పెరిగింది. తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 95.48 శాతానికి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

1798 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News