Tuesday, November 28, 2023

ఆటో బోల్తా: 18 మంది కూలీలకు గాయాలు….

- Advertisement -
- Advertisement -

18 Members injured in Auto roll over incident

 

ఎల్లారెడ్డి: ఆటో బోల్తా పడి 18 మంది కూలీలు గాయపడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుభాష్ నగర్‌కు చెందిన కూలీలు పత్తి తీయడం కోసం దుమాల గ్రామానికి బుర్ర శ్రీనివాస్ ఆటోలో వెళ్తున్నారు. హరిదాస్‌పూర్-వెంకటాపూర్ గ్రామాల మధ్య రేకుల లోడుతో ట్రాలీ ఆటో, కూలీల ఆటోకు ఎదురుగా వస్తుంది. ఈ క్రమంలో ట్రాలీ ఆటో నుంచి రేకు ఎగిరి కూలీల ప్రయాణిస్తున్న ఆటో మీద పడుతుండగా తప్పించుకునే క్రమంలో డ్రైవర్ ఆటోను రోడ్డు పక్కకు నడిపాడు. ఈ క్రమంలో ఆటో పొలంలో బోల్తాపడడంతో 18 మంది కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. జిందమ్ సత్తవ్వ అనే వృద్ధురాలు (70) చేయి విరిగింది. ట్రాలీ ఆటో డ్రైవర్ పరారీలో ఉండగా కూలీలు ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News