Saturday, April 20, 2024

పాక్ లో ఘోర బస్సు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

18 Pak flood victims killed after fire in bus

ఇస్లామాబాద్: వరద బాధితులతో వెళుతున్న ఒక బస్సులో మంటలు చెలరేగి 18 మంది సజీవదహనం అయ్యారు. మృతులలో 8 మంది పిల్లలు, 9 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘోర సంఘటన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సులో బుధవారం రాత్రి జరిగింది. 80 మంది వరద బాధితులతో క్రిక్కిరిసిపోయిన ఎసి బస్సులో మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటనజరిగింది. వీరింతా దాదు జిల్లాలోని ఖైన్‌పూర్ నాతన్ నుంచి కరాచీ వస్తున్నారని అధికారులు చెప్పారు. ఎయిర్ కండీషన్‌లో షార్ట్ సర్కూట్ జరగడంతో మంటలు చెలరేగి ఉండవచ్చని డిప్యుటీ కమిషనర్ జాం షోరో అనుమానం వ్యక్తం చేశారు. మంటల నుంచి తప్పించుకోవడానికి కొందరు ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దూకేశారని ఆయన చెప్పారు. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అంచేస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలకు సింధ్ ప్రావిన్సులోని దాదు జిల్లా తీవ్రంగా దెబ్బతింది. 1700 మందికి పైగా ఈ వరదల్లో మరణించగా 3 కోట్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

18 Pak flood victims killed after fire in bus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News