Tuesday, April 23, 2024

లాక్ డౌన్ ఎఫెక్ట్.. కాంక్రీట్‌ మిక్సర్‌ ట్రక్‌లో 18 మంది కార్మికులు

- Advertisement -
- Advertisement -

MIGRANT WORKERS

 

ఇండోర్‌: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో, వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెల్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.  కొంత మంది కాలినడకన వెళ్తుండగా, మరికొందరు సైకిళ్లపై తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇదేవిధంగా మహారాష్ట్ర నుంచి లక్నో వెళ్తున్న 18 మంది కార్మికులు ఓ సిమెంట్‌ మిక్సింగ్‌ ట్రక్‌ను ఆశ్రయించారు. వారంతా ఆ కాంక్రీట్‌ మిక్సర్‌లో ఎక్కారు. తమ ప్రయాణం సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సమీపంలో ఆ ట్రక్‌ను పోలీసులు తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. దీంతో వారందరిని క్వారంటైన్‌కు తరలించిన అధికారులు, ఆ ట్రక్‌పై కేసు నమోదు చేశారు. ఆ కార్మికులు మహారాష్ట్ర నుంచి లక్నో వెళ్తున్నారని ఇండోర్‌ డిఎస్పీ ఉమాకాంత్‌ చౌదరి వెల్లడించారు. ఇటీవలె కేంద్రం వలస కార్మకులను తరలించేందుకు గైడ్ లైన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

18 Workers in Concrete Mixer Truck
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News