Home జాతీయ వార్తలు ప్రేమోన్మాది ఘాతుకం…. యువతిపై పెట్రోల్ పోసి

ప్రేమోన్మాది ఘాతుకం…. యువతిపై పెట్రోల్ పోసి

Lover

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం తిరువళ్లలో ప్రేమించలేదని యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…  యువతి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతితో  ప్రేమోన్మాది అజిన్ రేజీ గొడవకు దిగాడు. దీంతో యువతి, యువకుడు మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. దీంతో ముందుగా తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను ఓపెన్ చేసి యువతిపై యువకుడి చల్లిన అనంతరం నిప్పుపెట్టాడు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 60 శాతం యువతి గాయపడిందని, యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. యువతి ప్రస్తుతం టాటా మెడికల్ సైన్సెస్‌లో బిఎస్‌సి చదువుతుంది. స్థానికులు ప్రేమోన్మాదిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

18 Year Old Teen Stalker Sets Girl on Fire in Kerala