Thursday, April 25, 2024

ఒక్క రోజే 180 పెరిగిన ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -
180 Fresh Omicron Cases in India
కొవిడ్ కేసులు సైతం 13 వేలకు పైగానే నమోదు

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోనూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. చాపకింద నీరులాగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 180 కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజాగా పెరిగిన కేసులతో కలిపి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 961కి చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 320 మంది కోలుకున్నారు.అత్యధికంగా 263 కేసులతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా,252 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఇక ముంబయిలో నిన్న ఒక్క రోజే 3,671కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.

గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, కేరళలో 65, తెంగాణలో 62 కేసులు నమోదయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఈ వేరియంట్ పాకింది. మరోవైపు గత కొద్ది రోజులుగా 10 వేల దిగువన నమోదవుతూ వస్తున్న కరోనా కేసులు సైతం బుధవారం ఒక్క రోజే 13 వేలకు పైగా నమోదయ్యాయి.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,154 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ సంఖ్య ముందురోజుకన్నా 43 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం 82,402 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 268 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు 3.48 కోట్ల మంది కొవిడ్ బారిన పడగా, రికవరీలు 3.4 కోట్లకు చేరాయి. మొత్తం మరణాల సంఖ్య4.80 లక్షలకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News