Home తాజా వార్తలు తెలంగాణలో కొత్తగా 186 మందికి సోకిన కరోనా

తెలంగాణలో కొత్తగా 186 మందికి సోకిన కరోనా

186 New Corona Cases Registered In Telanganaహైదరాబాద్ : గడిచిన ఒక్కరోజులో తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు నమోదైనట్టు  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గురువారం మీడియాకు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన ఒక్కరోజులో  కరోనాతో ఒకరు చనిపోయారని, 306 మంది కోలుకున్నారని వారు వెల్లడించారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో 2,93,923 మంది కరోనా బారినపడ్డారని, ఇందులో ఇప్పటివరకు మొత్తం 2,89,631 మంది కరోనా నుంచి కోలుకున్నారని వారు చెప్పారు. ఇప్పటివరకు కరోనాతో 1,594 మంది చనిపోయినట్టు వారు పేర్కొన్నారు.  తెలంగాణలో ప్రస్తుతం 2,698 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారని, వారిలో 1,213 మంది హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని అధికారులు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 35 మంది కరోనా బారినపడ్డారని అధికారులు తెలిపారు. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు స్పష్టం చేశారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు ఆరు గజాల సామాజిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని వారు ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.