Home జాతీయ వార్తలు భారత్ లో కొత్తగా 18,855 మందికి కరోనా

భారత్ లో కొత్తగా 18,855 మందికి కరోనా

18855 New Corona Cases Were Registered In Indiaఢిల్లీ : గడిచిన ఒక్కరోజులో భారత్ లో కొత్తగా 18,855 మందికి కరోనా సోకినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ  అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు. గడిచిన ఒక్కరోజులో 20,746 మంది కరోనా నుంచి కోలుకున్నారని, . దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,20,048 కు చేరిందని వారు వెల్లడించారు. గడిచిన ఒక్కరోజులో 163 మంది కరోనాతో బాధపడుతూ చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య  1,54,010 కు చేరిందని అధికారులు చెప్పారు.  దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,94,352  మంది కోలుకున్నారని,  ప్రస్తుతం 1,71,686  మంది కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని వారు చెప్పారు. ఇప్పటివరకు దేశంలో  29,28,053 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు వారు పేర్కొన్నారు. దేశంలో గురువారం వరకు మొత్తం 19,50,81,079 కరోనా పరీక్షలు నిర్వహించామని, గురువారం ఒక్కరోజే  7,42,306 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని వారు స్పష్టం చేశారు. అత్యవసర పనులు ఉంటేనే బహిరంగ ప్రదేశాలకు రావాలని, బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు విధిగా ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు.