Friday, April 19, 2024

నిర్మల్ లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Indrakaran Reddy

 

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మృతి చెందారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 400 మంది శాంపిల్స్‌లో 375 మంది రిపోర్ట్‌లు వచ్చాయని, ఇంకా 75 మంది రిపోర్ట్‌లు రావాల్సి ఉందన్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన 46 మంది, ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లి వచ్చిన ముగ్గురిని గుర్తించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మల్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిందన్నారు. ఆశ వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారని, థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారని, లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలన్నారు. నిర్మల్ జిల్లాలో 2,04,600 మంది తెల్లరేషన్ కార్డు దారుల ఖాతాల్లో రూ.30.5 కోట్లు జమ చేశామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కరోనా వైరస్ 644 మందికి సోకగా 18 మంది చనిపోయారు. భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా బాధితులు సంఖ్య 11,637కు చేరుకోగా 399 మంది చనిపోయారు.

 

 

19 Corona positive cases in Nirmal district
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News