Home అంతర్జాతీయ వార్తలు మెక్సికోలో కాల్పులు…. 19 మంది మృతి

మెక్సికోలో కాల్పులు…. 19 మంది మృతి

 

మెక్సికో: మెక్సికోలో భద్రతా బలగాలు, డ్రగ్స్ ముఠాకు మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది దుర్మరణం చెందారు. అమెరికా సరహద్దుకు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న విల్లా యూనియన్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, మాదక ద్రవ్యాల ముఠాకు మధ్య రెండు గంటల పాటు భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. చనిపోయిన వారిలో నలుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు, 13 మంది డ్రగ్స్ ముఠా సభ్యులున్నట్టు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి 14 ట్రక్కులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెక్సికన్ డ్రగ్స్ ముఠాను తీవ్రవాదులుగా గుర్తించామని ప్రకటించిన విషయం తెలిసిందే.

 

19 Members Dead in Shoot between Police and Army, Identified as Four Police, Two citizens, 13 Members Drugs Gang, trump says Drugs Gangs are Terrorist
19 Members Dead in Shoot between Police and Army