Friday, April 26, 2024

ప్రయాణికుల కోసం 19 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి….

- Advertisement -
- Advertisement -

19 special trains available for passengers

హైదరాబాద్: వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల నుంచి 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ హాలీడే స్పెషల్ రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ అన్ని రైళ్లలో ఏసి టూ టైర్, ఏసి త్రీ టైర్, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, నర్సాపూర్, కాచిగూడ, తిరుపతి, సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ టౌన్, బెర్హంపూర్, కాకినాడ, తిరుపతి, వికారాబాద్ రూట్‌లకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పలు రైల్వేస్టేషన్‌ల నుంచి….

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, కాకినాడ, బరంపూర్, నర్సాపూర్, తిరుపతి నుంచి సికింద్రాబాద్, విజయవాడ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి నర్సాపూర్, కాచిగూడ నుంచి తిరుపతి నగరాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. 07438 / 07437 నంబర్ గల సికింద్రాబాద్ టు -తిరుపతి రైలు 13వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో 14వ తేదీ సాయంత్రం 7.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. 07468 / 07469 స్పెషల్ ట్రైయిన్ 13వ తేదీ రాత్రి 8.45 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ బరంపూర్ రైలు 13 సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు బరంపూర్‌లో బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు నర్సాపూర్ ట్రైయిన్ 15వ తేదీ రాత్రి 10.35 గంటలకు బయలుదేరి 17రాత్రి 8 గంటలకు నర్సాపూర్ లో బయలు దేరుతుంది. 07585 తిరుపతి- టు సికింద్రాబాద్ రైలు ఈ నెల 17 సాయంత్రం 7.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.

తిరుపతి టు -సికింద్రాబాద్ రైలు

తిరుపతి టు -సికింద్రాబాద్ రైలు 15వ తేదీ రాత్రి 9 గంటలకు తిరుపతిలో ప్రారంభమవుతుంది. విజయవాడ – సికింద్రాబాద్ (07441) రైలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మర్నాడు ఉదయం 4.10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ -టు నర్సాపూర్ (07477/07478) 13వ తేదీ సాయంత్రం 4.55 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి, తిరుగు ప్రయాణంలో 14వ తేదీ ఉదయం 7 గంటలకు నర్సాపూర్ నుంచి మొదలవుతుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ- టు తిరుపతి (07297/07298) రైలు 13 రాత్రి 10.20 గంటలకు కాచిగూడలో, 14 మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News