Home రంగారెడ్డి శివారు ప్రాంతాల మంచినీటికి రూ.1900 కోట్లు

శివారు ప్రాంతాల మంచినీటికి రూ.1900 కోట్లు

రెండు జిల్లాల్లోని మునిసిపాలిటీలతో పాటు మెదక్‌లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు కల్పించే సదుపాయం

 రక్షిత మంచినీరు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి
 ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
మన తెలంగాణ/రంగారెడ్డి : జిల్లాలో ఉన్న శివారు మున్సిపాలిటిలతో పాటు మెదక్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీలకు తాగునీరు సదుపాయం కల్పించేందుకు 1900 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మహేందర్ రెడ్డి తో కలసి శివారు ప్రాంతాల మంచినీటి సమస్యపై సమీక్ష నిర్వహించారు.
KTRమన తెలంగాణ / రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో ఉన్న శివారు మున్సిపాలిటిలతో పాటు మెదక్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీలకు తాగునీరు సదుపాయం కల్పించేందుకు 1900 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మహేందర్ రెడ్డి తో కలసి శివారు ప్రాంతాల మంచినీటి సమస్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ హడ్కో ద్వారా శివారు ప్రాంతాల మంచినీటికి రూ.1700 కోట్ల రుణం మంజూరు అయిందని 200 కోట్లు ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌కు 80 కోట్లు, అల్వాల్ 190 కోట్లు, కాప్రా 215 కోట్లు, ఎల్.బి.నగర్ గడ్డి అన్నారం కలిపి 325 కోట్లు, ఉప్పల్ 160 కోట్లు, కూకట్‌పల్లి 290 కోట్లు, శేరిలింగం పల్లి 290 కోట్లు, కుత్బుల్లాపూర్ 220 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మెదక్ జిల్లా రాంచంద్రాపురం రూ.60 కోట్లు, పటాన్‌చెర్వుకు 70 కోట్లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఈ పనులన్నీ పూర్తి అయితే 30 లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందుబాటులోకి వస్తుం దని అన్నారు. పాడుబడిన పైపులైన్‌లను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని కొత్త పైప్‌లైన్‌లు నాణ్యతతో పాటు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్త్తూ వేయాల న్నారు. తాగునీరు, మురుగు నీరు పైప్‌లైన్ వివరాలను రూట్ మ్యాప్‌తో సహా వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచించారు. జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు ఆవసరమైన చోట పైప్‌లైన్‌లకు ఫైర్ హైడ్రెంట్‌లు వాడాల ని దీనివలన ప్రమాదాలు జరిగినపుడు నీరు తీసుకుని వాడుకోవడానికి అవకాశం ఉంటుంద న్నారు. ఐటి హబ్ చుట్టుపక్కల నీటి సరఫరా పైపులైన్‌లు వెయడానికి ఐ టి శాఖ నుంచి 25 కోట్లు మంజూరు చెస్తున్నట్లు మంత్రి తెలిపారు. మం త్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 164 గ్రామాలకు మెట్రోవాటర్ వర్క్ వారు నీటిని సరఫరా చెస్తారని తెలిపా రు.క్రిష్ణా మూడవ విడతలో డిసెంబర్ నుంచి నీటి సరఫరా చెయడం జరుగుతుందని తెలిపారు. జవహర్ నగర్, కీసర ప్రాంతాలకు త్వరగా మంచినీరు సరఫరా చెయడానికి పైప్‌లైన్‌లు వెయాలని సూచించారు. హ డ్కో రుణంతో డిసెంబర్‌లోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చెసుకుని నిర్మాణ పనులు చెపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మున్సి పల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ఎం.జి గోపాల్, గ్రేటర్ కమీషనర్ సోమేష్ కుమార్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మెట్రోవాటర్ వర్క్ ఎండి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు