Saturday, April 20, 2024

తెలంగాణలో కొత్తగా 1986 పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

1986 new Corona positive cases in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 1986 కొత్త కోవిడ్-19 కేసులు 14 మరణాలు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్ కేసులు సంఖ్య 62,703కి చేరింది. మృతుల సంఖ్య 519కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,796 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 21,380 కరోనా టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 45,388 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా హైదరాబాద్ 586, మేడ్చల్ 207, రంగారెడ్డిలో 205 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు ఎపిలోనూ కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి.

1986 new Corona positive cases in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News