Home తాజా వార్తలు బంగారు తెలంగాణ కోసం ప్రార్థించండి: హోంమంత్రి

బంగారు తెలంగాణ కోసం ప్రార్థించండి: హోంమంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్: బంగారు తెలంగాణ కోసం ప్రార్ధించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. రాష్ట్ర హజ్ కమిటీ నుంచి గురువారం ఉదయం కర్ణాటక రాష్ట్రానికి చెందిన తొలి యాత్రికుల బృందానికి ఆయన వీడ్కోలు పలికారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యాత్రికుల బృందం గురువారం ఉదయం బయలుదేరి వెళ్లింది. ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల ద్వారా ఈ ఏడాది తెలంగాణ హజ్ కమిటీ యాత్రికులను మక్కా నగరానికి పంపుతున్నారు. ఇదిలా ఉండగా ఈ బృందంలో 423 మంది యాత్రికులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసివుల్లా ఖాన్, సిఇఒ బి.షఫివుల్లా, కమిటీ సభ్యులు అంజద్, అరిఫోద్దీన్, షరీఫ్, ఎసిఒ ఇర్పాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

1st batch of TS Haj Pilgrims leaves from Shamshabad