Home వార్తలు ‘2.0’ 100  రోజుల షూటింగ్ పూర్తి

‘2.0’ 100  రోజుల షూటింగ్ పూర్తి

Rajinikanthసౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం ‘కబాలి’ విడుదల కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు, అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇదిలాఉండగా రజనీ చేస్తున్న రోబో సీక్వెల్ మూవీ ‘2.0’… శంకర్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ సినిమా అయిన దీన్ని 350 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వంద రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ “2.0 చిత్రం 100 రోజుల షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. రెండు మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించాం. ఇందులో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లతో కూడిన క్లైమాక్స్ సీన్స్‌ను కూడా పూర్తిచేశాం”అని అన్నారు. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ అమీ జాక్సన్‌తో రొమాన్స్ చేస్తున్నాడు రజనీకాంత్. విలన్‌గా అక్షయ్‌కుమార్ సినిమాలో అదరగొట్టబోతున్నాడు. ‘2.0’ కోసం రజనీకంటే అత్యధిక పారితోషికాన్ని అక్షయ్ తీసుకోవడం విశేషం. సినిమాలో సైంటిస్ట్ వసీగరన్, రోబో చిట్టీగా రజనీకాంత్ కనిపించనుండగా… సైంటిస్ట్ డాక్టర్ రిచర్డ్ పాత్రలో అక్షయ్‌కుమార్ నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ భారీ బడ్జెట్ మూవీ రూపుదిద్దుకుంటోంది. ‘2.0’ మూవీ గ్రాఫిక్స్ కోసమే ఫిల్మ్‌మేకర్స్ 100 కోట్లను కేటాయించడం విశేషం. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.