Home తాజా వార్తలు ‘2.0’ మూవీ స‌ర్‌ప్రైజ్..!

‘2.0’ మూవీ స‌ర్‌ప్రైజ్..!

‘2.0’ Movie Making Video Released

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్, క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు ‘2.0’. ఈ చిత్రాన్ని దాదాపు 545 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌ను వినాయ‌క చ‌వితి కానుకగా సెప్టెంబర్ 12న విడుదల చేశారు. విడుదలైన 24 గంట‌ల‌లోనే 32 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక టీజర్ కంటే ముందు మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా మరో మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా కోసం 1000 మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్, కాన్సెప్ట్ ఆర్టిస్టులు, 3డీ డిజైన‌ర్స్ వందల సంఖ్యలో ప‌ని చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని 400 కోట్ల  భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.  తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ 29న రిలీజ్ చేయాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేశారు.