Thursday, April 25, 2024

యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకలు

- Advertisement -
- Advertisement -

2.5 kg Hair Removed from Woman Stomach in Nirmal

హైదరాబాద్: యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రులకను వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఈ సంఘటన నిర్మల్ పట్టణంలో చోటుచేసుకుంది. యువతి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. మొదట సాధారణ సమస్యే అని వైద్యులు వెల్లడించారు. ఎండోస్కోపీ తీయడంతో వెంట్రుకల ఉండ కనిపించింది. వెంట్రుకలు చిన్నపేగులో ఉండలా చుట్టుకున్నాయి. దీంతో శస్త్రచికిత్సలు చేసి దాన్ని తొలగించారు. మానసిక ఎదుగుదల లేకపోవడంతోనే యువతి వెంట్రుకలు తినేసింది. ఆమెకు తన జుట్టును తాను పీక్కుతినే ట్రైకోఫీలియా అనే మానసిక వ్యాధి ఉందని వైద్యులు తెలిపారు. ప్రసుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

2.5 kg Hair Removed from Woman Stomach in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News