Home జాతీయ వార్తలు చెన్నైకి వాటర్ ట్రెయిన్

చెన్నైకి వాటర్ ట్రెయిన్

Water Arrives

 

2.5 మిలియన్ లీటర్ల నీటిని తీసుకొచ్చిన రైలు

చెన్నై: గత కొన్ని నెలలుగా తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటున్న చెన్నైకి 2.5 మిలియన్ లీటర్ల నీటిని రైలులో తరలించినట్లు అధికారులు తెలిపారు. వెల్లూరు జిల్లాలోని జోలార్ పేట నుంచి ఒక్కొక్క ట్యాంక్‌లో 50 వేల లీటర్ల చొప్పున 50ట్యాంక్ వ్యాగన్లతో రైలు శుక్రవారం మధ్యాహ్నం విల్లివాక్కంలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యార్డు వద్ద ఫిల్లింగ్ స్టేషన్‌కు చేరుకుంది. నీటిని విడుదల చేసేందుకు రైల్వే ట్రాక్ సమీపంలో దాదాపు 100 ఇన్‌లెట్ పైపులను ఏర్పాటు చేశారు. కాగా, మంత్రులు అధికారికంగా నీటిని విడుదల చేసేందుకు ప్రజలు మూడు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది.

గురువారం చెన్నైకి చేరుకోవాల్సిన రైలు, కవాటాలలో లీకేజీతో ఆలస్యమైంది. వచ్చే ఆరు నెలల్లో ఈశాన్య రుతు పవనాలు వచ్చే వరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారి తెలిపారు. 20 రోజుల్లో ఏర్పాట్లన్ని పూర్తి చేశారు. జోలార్ పేట నుంచి దక్షిణ మెట్రో పోలిస్‌కు 217 కి.మీ. దూరం ఉన్నట్లు తెలుస్తోంది. జోలార్‌పేట నుంచి చెన్నైకి మంచి నీటిని తరలించేందుకు రూ. 65 కోట్లు కేటాయించినట్లు గతంలో ముఖ్యమంత్రి కె పళనిస్వామి ప్రకటించారు.

2.5 Million Litres of Water Arrives in Parched Chennai