Saturday, April 20, 2024

ఆక్సిజన్ రవాణా కోసం దుబాయ్ నుంచి 2 కంటెయినర్లు

- Advertisement -
- Advertisement -

2 containers from Dubai for transporting oxygen

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తీవ్రతరమై మెడికల్ ఆక్సిజన్‌కు విపరీతమైన కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆక్సిజన్ రవాణాకు అవసరమైన రెండు కంటెయినర్లను దుబాయ్ నుంచి తెప్పిస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది. గత శనివారం నాలుగు క్రయోజెనిక్ ట్యాంకులతో ఆక్సిజన్‌ను సింగపూర్ నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంపొందించడానికి చేపడుతున్న చర్యలలో భాగంగా ఆక్సిజన్ రవాణాకు అవసరమైన ఖాళీ కంటెయినర్లను దుబాయ్ నుంచి తెప్పిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. కొవిడ్-19 రోగుల చికిత్సలో అత్యవసరమైన ఆక్సిజన్ దేశంలోని అన్ని ఆసుపత్రులకు సరఫరా అయ్యేందుకు వీలుగా వివిధ ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటెయినర్లు ఉంచేందుకు హోం మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News