Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్‌ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఆసిఫాబాద్‌ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

2 Died in Road Accident in Asifabad

కుమ్రం భీం ఆసిఫాబాద్‌: జిల్లాలోని రెబ్బన మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని దేవుళగూడెం వద్ద ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందినవారిని తెనుగుగూడకు చెందిన గీత, గణేశ్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

2 Died in Road Accident in Asifabad