Thursday, April 25, 2024

సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఈ నేపధ్యంలో అధికారులు సాగర్ 2 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులోకి 65,275 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 589.50 అడుగులుగా ఉంది.  సాగర్ జలాశయం అందాలను చూసేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు.

2 Gates Opened at Nagarjuna Sagar Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News