Thursday, April 25, 2024

రొమాంటిక్ సాంగ్‌కు 2 మిలియన్ వ్యూస్

- Advertisement -
- Advertisement -

world famous lover

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె లెయితే హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘మై లవ్’ను రిలీజ్ చేసింది. గోపీసుందర్ వినసొంపైన బాణీలు, రెహమాన్ ఆకట్టుకొనే సాహిత్యం, శ్రీకృష్ణ, రమ్యా బెహరా మధుర గానం కలిసి హృదయాన్ని హత్తుకునే మెలోడీగా ఈ పాట తయారైంది.

నలుగురు హీరోయిన్లతోనూ విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయినట్లు ఈ పాటలో కనిపిస్తున్నాడు. కాగా సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ చార్ట్‌బస్టర్ రొమాంటిక్ సాంగ్ యూ ట్యూబ్‌లో 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కె.ఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

2 Million Views For The Romantic Song
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News