Wednesday, April 24, 2024

ఛత్తీస్‌గడ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్..

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర: మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని భీజాపూర్ జిల్లా దామ్రన్చ అటవీ ప్రాంతం టెకమెట్‌లో మహారాష్ట్ర సి-60- బలగాలు, మావోయిస్ట్‌లకు మధ్య శుక్రవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విసి కమాండర్ సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిలో కణితి లింగమ్మ అలియాస్ అనిత ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈమె నిర్మల్ జిల్లా కడెంలోని లక్ష్మీసాగర్‌కు చెందినదిగా సమాచారం. తెలంగాణ ఇంద్రవెళ్లి డివిజన్ కార్యదర్శిగా లింగమ్మ కొనసాగుతున్నారు. ఈమెకు మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్‌తో వివాహం అయ్యింది. లింగమ్మ పై తెలంగాణలో రూ.5లక్షలు, మహారాష్ట్రలో రూ.16లక్షల నజరానా ఉంది.

1997లో మావోయిస్టు దళ సభ్యుల పాటలకు ఆకర్షితురాలై లింగమ్మ దళంలోకి వెళ్ళింది. తల్లిదండ్రుల రాజన్న, రాజవ్వ. వీరికి ముగ్గురు సంతానం లింగమ్మ పెద్దది రమేష్, రవి ఇద్దరు సోదరులు.. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. 2006-2007 మధ్య కాలంలో ఆరోగ్యం సరిగాలేని కారణంగా నిర్మల్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో పోలీసులకు అందిన సమాచారంతో లింగమ్మను అరెస్టు చేశారు. అనంతరం జైల్ నుంచి వచ్చిన ఆమె 2008-2009 మధ్య కాలంలో దళంలోకి తిరిగి వెళ్ళింది. తాజా ఎదురు కాల్పుల్లో లింగమ్మ మృత్యువాత పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News