Home తాజా వార్తలు నిజమాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నిజమాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Road Accident

 

నిజమాబాద్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జిల్లాలోని డిచ్ పల్లిలో జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసునమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

2 people dead in road accident in Nizamabad