- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం ఉదయం షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలోని డ్రాగడ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో బుధవారం ఉదయం పోలీసులు, భద్రతా బలగాలు కలిసి కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ ను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
2 Terrorists killed by security personnel encounter
- Advertisement -