Home జాతీయ వార్తలు ఇద్దరు నేషనల్ కాంగ్రెస్ కార్యకర్తల కాల్చివేత

ఇద్దరు నేషనల్ కాంగ్రెస్ కార్యకర్తల కాల్చివేత

Death-image

అహ్మద్ నగర్ : మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు నేషనల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దుండగులు కాల్చి చంపారు. మూడు వారాల క్రితం ఏప్రిల్ 7 తారీఖున ఇదే జిల్లాలో సాహునగర్ లోని కేడ్ గాంలో ఇద్దరు స్థానిక శివసేన నాయకులను కాల్చి చంపిన ఘటన మరవకు ముందే ఈ ఘటన జరగటంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. అహ్మద్ నగర్ జిల్లా కేంద్రానికి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న జాంఖేడ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు రోడ్డు పక్కన నిలబడి ఉన్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగట్ నాయకుడు యోగేశ్, అంబదాస్(30), కాంగ్రెస్ పార్టీ అఫీస్ బేరర్ రాకేశ్ అర్జున్ (23)లపై ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.