Home తాజా వార్తలు పశువుల మందపై పిడుగు పడి 20 పశువులు మృతి

పశువుల మందపై పిడుగు పడి 20 పశువులు మృతి

20 cattle were killed when lightning struck herd of cattle

 

మనతెలంగాణ/ పదర: పశువుల మంద పై పిడుగు పడి ఇరవై పశువులు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని బికె ఉప్పునుంతల సమీప ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం పదర మండల పరిధిలోని చిట్లంకుంట గ్రామానికి చెందిన పశువుల కాపరులు పశుగ్రాసం కోసం బండ్ల రేవు అడవి ప్రాంతంలో ఆవుల మంద ఏర్పాటు చేసుకొనిపశువులను మేపుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం పశువుల మేత మేసి నీళ్ల కోసం వెళ్తుండగా ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురై రాములు జైపాల్‌కు చెందిన 20 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని మాజీ సర్పంచ్ బిలావత్ బిచ్చ నాయక్ తెలిపారు. చనిపోయిన పశువుల విలువ దాదాపు 6 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి పిడుగుపాటుతో పశువులు మృతి చెందిన బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలనిబాధితులు రాములు, జైపాల్, హాన్య, బిచ్చనాయక్ కోరారు.