Saturday, April 20, 2024

ప్రొఫెసర్లపై కరోనా పంజా

- Advertisement -
- Advertisement -

20 days 18 professors died with Corona

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లపై కరోనా పంజా విసురుతోంది. 20 రోజుల్లో 18 మంది ప్రొఫెసర్లు కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా విశ్వవిద్యాలయ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరో మంద మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది జవాహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మే ఎనిమిది నాటికి క్యాంపస్ లో మొత్తం 417 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా 295 మంది కోలుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ విసి తారిక్ మన్సూర్ సొదరుడు కూడా కోవిడ్ తో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో విసి తారిక్ మన్సూర్ ఐసిఎంఆర్ కు లేఖ రాశారు. క్యాంపస్ లో సేకరించిన వైరస్ నమూనాలను విశ్లేషించాలని కోరారు. దాని ఆధారంగా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

 

20 days 18 professors died with Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News