Home జగిత్యాల బొలెరోను ఢీకొట్టిన లారీ: 20 మేకలు, డ్రైవర్ మృతి

బొలెరోను ఢీకొట్టిన లారీ: 20 మేకలు, డ్రైవర్ మృతి

Road Accident

 

ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రామాయపల్లె శివారులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి మేకలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 20 మేకలు చనిపోయాయి. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ ను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ చికిత్స పొందుతూ దుర్మరణం చెందాడు.

 

20 Goats Dead in Lorry Collided to Bolero Vehicle in Jagtial