Friday, April 19, 2024

టాంజానియా చర్చిలో తొక్కిసలాటలో 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Tanzania

 

దార్ ఎస్సలామ్ : టాంజానియా లోని ఆరు బయలు క్రైస్తవ చర్చిలో శనివారం తొక్కిసలాట జరిగి 20 మంది మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. ప్రఖ్యాత మతబోధకుడు బొనిఫేస్ మ్వంపోసా ఆధ్వర్యంలో సువార్త మహాసభలు జరుగుతుండగా క్రైస్తవ భక్తులు వేలాది మంది ప్రార్థనలకు హాజరయ్యారు. మ్వంపోసా తాను దైవదూతనని, చెప్పుకుంటూ నేలపై పవిత్ర తైలాన్ని చల్లడంతో జనం ఆ తైలాన్ని స్పర్శించడానికి ఒక్కసారి ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తైలం తాకితే తమ పాపాలు, రోగాలు పోతాయని జనం నమ్మకం. ఈ దుర్ఘటన జరిగిన తరువాత మతబోధకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. విచారణకు లొంగి పోవాలని బహిరంగంగా కోరుతున్నారు. అధ్యక్షుడు జాన్ మగుఫులి మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.

20 killed in Tanzania church stampede
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News