Home అంతర్జాతీయ వార్తలు తాలిబన్ల దాడిలో 20 మంది పోలీసులు మృతి

తాలిబన్ల దాడిలో 20 మంది పోలీసులు మృతి

Talibansకాబూల్‌ : అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు గురువారం రెచ్చిపోయారు. 20 మంది పోలీసులను హతమార్చారు. పశ్చిమ బాద్గీస్‌లోని మలాల్‌ ముర్గాబ్‌లో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో గురువారం తాలిబన్లు తుపాకులతో ఒక్కసారిగా దాడికి దిగారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడిలో 20 మంది పోలీసులు మృతి చెందారని, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారని వారు వెల్లడించారు. ఈ ప్రాంతంలో తాలిబన్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారి జమ్షిద్‌ షాహాబీ మీడియాకు చెప్పారు. తాలిబన్ల దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడికి తామే పాల్పడ్డామని తాలిబన్‌ నేత యూసఫ్‌ అహ్మాదీ ప్రకటించారు. తాలిబన్లతో అమెరికా  చర్చలు జరిపే ప్రయత్నాలు చేస్తుంది. అయితే తాలిబన్లు మాత్రం దాడులకు దిగుతున్నారు.

20 Policemen Shot Dead by Talibans in Afghanistan