Home తాజా వార్తలు చెరువులో పడిన స్కూల్ బస్సు

చెరువులో పడిన స్కూల్ బస్సు

School-Bus-Fell-into-Pond-i

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఖైరా గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 45 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును పైకి లేపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బస్సు డ్రైవర్, స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. జిల్లా ఉన్నత విద్యాధికారులు స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.