Home తాజా వార్తలు రంగారెడ్డిలో దారుణం.. కొడుకుని హత్యచేసిన కన్నతల్లి

రంగారెడ్డిలో దారుణం.. కొడుకుని హత్యచేసిన కన్నతల్లి

Pregnant

హైదరాబాద్: కన్న కొడుకునే ఓ తల్లి హతమార్చిన సంఘటన కలంకలం రేపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో చోటు చేసుుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లెతండాకు చెందిన 20 ఏళ్ల ఇస్లావత్‌ హరిలాల్‌ ఎలాంటి పని చేయకుండా ఊరిమీద పడి తిరిగేవాడు. దీంతో తల్లి చాందీ ఎన్నిసార్లు చెప్పిన మాట వినలేదు. ఈ క్రమంలో బాగా విసిగిపోయిన తల్లి.. కొడుకుని చంపిస్తేనే మంచిదని భావించింది. ఈ నెల 22న ఇంట్లోనే కొడుకు గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని తండా శివారులోకి తీసుకెళ్లి కంపచెట్లల్లో పడేసింది.

ఆ తర్వాత తన కుమారుడు మతిస్థిమితం లేక ఎక్కడెక్కడో తిరిగేవాడని, ఇంటికి కూడా సరిగ్గా వచ్చేవాడు కాదని.. ఇంట్లోంచి బయటకు వెళ్లిన అతను చనిపోయాడని తండా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది తల్లి. కానీ, పోస్టుమార్టంలో హరిలాల్‌  హత్యకు గురైనట్టు తేలడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో తన నేరాన్ని అంగీకరించింది. దీంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు.

20 yrs old Son killed by Mother in Rangareddy