Home రాష్ట్ర వార్తలు కృత్రిమ మిగులు

కృత్రిమ మిగులు

  • అవాస్తవిక అంచనాల వల్ల 2015-16 బడ్జెట్‌లో ఖర్చుకాని రూ.35,262 కోట్ల కేటాయింపులు, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక నిశిత విమర్శ
  • శాసనసభ అనుమతి లేకుండానే రూ.5,881 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి

CAG-Logo

హైదరాబాద్ : అవాస్తవిక బడ్జెట్ అంచనాలు, అవాస్తవిక కేటాయింపుల పర్యవసానంగా ప్రభుత్వం చేసిన పలు విధాన నిర్ణయాలు నెర వేరలేదని 2016 మార్చితో ముగిసిన (2015-16) సంవత్సర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై భారత కం ప్ట్రోలర్, ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఎత్తి చూపిం ది. తప్పుగా వర్గీకరించి, పద్దుల విధానాలను అతిక్ర మించి ప్రభుత్వం రెవెన్యూ మిగులును ఎక్కువ చేసి చూపించిందని కూడా వెల్లడించింది. తద్వారా ద్రవ్య లోటును జిఎస్‌డిపితో పోల్చినప్పుడు నిష్పత్తిని 3.87 శాతంగా కాకుండా, 3.23గా చూపిందని కాగ్ తప్పుబట్టింది. ఈ అవాస్తవిక అంచనాల ఫలితంగా రూ.35,262 కోట్ల మేర (25 శాతం) కేటాయింపు లు ఖర్చు కాలేదని, ఇందులో 2016 మార్చి 31న రూ.16,269 కోట్లను సరెండర్ చేశారని నివేదిక పేర్కొన్నది. ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాల కు విధి విధానాలను ఖరారు చేయలేదని, పాలనా పరమైన అనుమతులు ఇవ్వలేదని, పథకాలను అమ లు చేసే సామర్థం కొరవడిందని, వీటికి తోడు నిధులు విడుదల చేయకపోవడం ప్రకటిత పథకాలు అమలు కాకపోవటానికి ప్రధాన కారణాలుగా కాగ్ వివరించింది. వివిధ పథకాలు అమలు చేయడం కోసం తీసుకున్న నిధులను వాస్తవంగా ఖర్చు చేయకుండానే వినియోగ ధ్రువపత్రాలను పంపించారని నివేదిక వెల్లడిం చింది. శాసనసభ అనుమతి లేకుండానే ప్రభుత్వం రూ.5,881 కోట్లు ఖర్చు చేసిందని కూడా వెల్లడించింది.  ప్రస్తావించిన ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం రెవెన్యూ వ్యయం 80 శాత ంలో మౌలిక వసతుల కల్పనకు, సంపదలను సమకూర్చుకునేందుకు కేవ లం 20 శాతం మాత్రమే ఖర్చు చేసిందని వివరించింది. కేటాయించిన నిధు లను ఆశించిన ప్రయోజనాలకు పూర్తిగా వినియోగం అయ్యేలా చూడలే దని వెల్లడించింది.  ఇప్పటి వరకు రూ.3,532 కోట్లకు  సంబంధించిన ఖ ర్చు వి వరాలు ట్రెజరీ కార్యాలయాల నుండి  రాకపోవడం నిధుల గోల్‌మా ల్‌కు తావిస్తోందని కాగ్ హెచ్చరించింది.  చేయని నిధులను  రెవె న్యూ రాబ డి కింద చూపించడంతో అది రూ.4,218 కోట్ల వరకు బడ్జెట్ ఎక్కువగా పెరి గిందని స్పష్టం చేసింది. ఇది  పద్దుల నిబంధనలను ఉల్లంఘ నేనని పేర్కొం ది.  రాష్ట్ర అప్పుల్లో సగానికిపైగా (53 శాతం) రానున్న  ఏడేళ్ళ లో చెల్లించా ల్సి ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో పెట్టుబడులపై రాబడి రావడం లేద ని పేర్కొం ది.  గత ఆర్థిక సంవత్సరంలతో అనేక మార్లు అవాస్తవిక బడ్జెట్ అంచనాలు, వ్యయ పర్యవేక్షణ, నియంత్రణలో బలహీనతలు స్పష్టంగా కని పించాయని కాగ్ వ్యాఖ్యానించింది. అనేక సందర్భాల్లో సబ్సిడీలను , కేంద్ర రహదారి నిధి వంటి వాటిని తప్పుడు వర్గీకరణ చేయడం వంటి చర్యలు బడ్జెట్ రూప కల్పనలో లోపాలను సూచిస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది. అవాస్తవిక బడ్జె ట్ కేటాయింపుల ఫలితంగా గణనీయమైన మిగులు వచ్చిందని,  వాటిని అనవసర గ్రాంట్లు, బడ్జెట్‌లో లేని అంశాలకు కేటాయించి ఖర్చు చేశారని తెలిపింది. ఫలితంగా  మరోరూపంలో ద్రవ్య వినియోగంతో ఏర్పడిన అదన పు కేటాయింపు వంటి అంశాలు పేలవమైన బడ్జెట్ నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతోందని పేర్కొంది. అనేక స్వయం ప్రతిపత్తి సంస్థలు సకాలంలో వార్షిక పద్దులను సమర్పించడం లేదు. దీంతో జవాబుదారీతనం, పద్దుల అసలు ఉద్దేశాలు నీరుగారుతున్నాయి. పలు పథకాలకు సంబంధించిన నిధు లు పూర్తి స్థాయిలో విడుదల కాకముందే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అంద జేస్తున్నారు. అవసరానికంటే ముందుగా నిధులను డ్రా చేయడం, ఖర్చు కాని నిధులు చివర్లో మురిగిపోవడంతో పెద్ద ఎత్తున ఖాతాల్లో నిధులు పేరుకుపోతున్నాయని కాగ్ వెల్లడించింది.