Home తాజా వార్తలు ఆకాశంలో ఉల్కల వెలుగుల జల్లులు

ఆకాశంలో ఉల్కల వెలుగుల జల్లులు

Meteor-showersఆకాశంలో ఉల్కలు ఏది కనిపించినా నేత్రానందమే. అర్ధరాత్రి దాటాక శనిగ్రహాన్ని వీక్షించే అవకాశం జులైలో లభించగా ఉల్కల జల్లులను సందర్శించే అవకాశం ఆగస్టు వరకూ కలుగుతుందని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెల్టా ఆక్వారిడ్ మెటియోర్ అని శాస్త్రీయంగా పిలిచే ఈ ఉల్కల జల్లులను ఆగస్టు 23 వరకు స్పష్టంగా చూడవచ్చని అమెరికన్ మెటియోర్ సొసైటీ వెల్లడించింది. జులై 29 సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఉల్కల జల్లులు విశేషంగా కనువిందు చేశాయి. సాధారణంగా దక్షిణార్థ గోళం నుంచి మధ్య, ఉత్తర అక్షరేఖ నుంచి ఇవి రాత్రిపూట కనిపిస్తూనే ఉంటాయి. చంద్రుని గమనం పక్కకు వెళ్లినప్పుడు గంటకు 20 వరకు ఈ ఉల్కలు వెలువడుతుంటాయి.

డెల్టా ఆక్వారిడ్ ఉల్కలు అంటే …

విరిగిన ఉపగ్రహాల శిధిల తునకలతోపాటు తోకచుక్కల నుంచి జారిపడే రేణువులతో ఉల్కలు తయారవుతుంటాయి. సూర్యుని చుట్టూ తోకచుక్క పరిభ్రమిస్తున్నప్పుడు రాలిన దుమ్ము కణాలు జాడగా విస్తరిస్తాయి. ఈ జాడ లోంచి భూమి వెళ్లేటప్పుడు ఈ చిన్న రేణువులు డెల్టా ఆక్వారియస్‌ను సృష్టించడానికి వాతావరణంతో సంఘర్షిస్తాయి. ఆకాశంలో రాలుతున్నట్టు కనిపిస్తాయి. తోకచుక్క 96 పి/మెకడ్జ్ నుంచి డెల్టా ఆక్వారిడ్స్ రూపొందినట్టు కనిపిస్తుంది. ఈ తోకచుక్క ఐదేళ్ల కొకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆక్వారిటస్ నక్షత్ర మండలం నుంచి వీటి అణుధార్మిక శక్తి వస్తుంది. ఆక్వారిటస్ నక్షత్ర మండలం లోని మూడవ పెద్ద నక్షత్రాన్ని డెల్టా అని వ్యవహరిస్తారు.

ఈ ఉల్కల్లో 5నుంచి 10 శాతం జ్వలిస్తున్న జాడను విడిచిపెడతాయి. నిముషానికి ఒక ఉల్క వంతున అందులోంచి వెళ్తుంది. భూమి ఉపరితల వాతావరణంలో అంటే వంద కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉల్కలు మండుతుంటాయి. ఈ దృశ్యాన్ని చూడాలంటే దక్షిణార్ధగోళమే సరైన ప్రదేశం. నగర ప్రాంతాల్లో విద్యుత్ దీపాల వెలుగులో వీటిని చూడలేం. ఇలాంటి కృత్రిమ వెలుగులు లేని దట్టమైన చీకటి ప్రదేశం నుంచే వీటిని సందర్శించ గలం. ఆక్వారియస్ నక్షత్ర మండలం నుంచి 45 డిగ్రీల కోణంలో ఆకాశంలో కింది నుంచి మీది వరకు తదేక దీక్షతో గమనిస్తే ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కరిస్తుంది.

2019 meteor showers