Thursday, March 28, 2024

రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు

- Advertisement -
- Advertisement -

cp maheshbhagawath

 

1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్
హోం క్వారంటైన్‌లో 1,771మంది
వారిపై నిరంతరం నిఘా పెట్టాం
991 పాస్‌పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత
వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్

మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారు 2,094 మందిని గుర్తించామని, వారిలో 1,834 మంది గుర్తించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఇందులో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, 991 మంది పాస్‌పోర్టులను సీజ్ చేశామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 21 కేసులు నమోదు చేశామని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు 59 కేసులు నమోదు చేశారని, 70మంది ఉల్లంఘించారని అన్నారు.

18 మోటార్ సైకిళ్లు, రెండు కార్లను సీజ్ చేశామని తెలిపారు. అత్యవసరం ఉన్నవారు డయల్ 100కు ఫోన్ చేయాలని, 108 రావడం ఆలస్యమైతే పోలీసులకు ఫోన్ చేస్తే సాయం చేస్తారని తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్లు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారు 21 రోజులు ఇంట్లోనే ఉండాలని, వారిని చుట్టుపక్కల వారు గమనించాలని వారు నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. కరోనా కంట్రోల్ రూమ్ 24గంటలు పనిచేస్తుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై 9490617234కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేయాలని కోరారు.

కూలీలకు చేయూత
వివిధ రాష్ట్రాల నుంచి కూలీ పనుల కోసం నగరానికి వచ్చిన వారికి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఎల్‌బి నగర్‌లోని 650 మంది కూలీలను గుర్తించామని వారికి భోజనం తదితర సుదుపాయాలు కల్పించామని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 200 మంది కూలీలు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారని, 133 మంది ఒడిసాకు చెందిన కూలీలు రాంపల్లి, మాల్లాపూర్, తుర్కపల్లి, చౌటుప్పల్, ఉప్పల్‌లో ఉన్నారని వారికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. కూరగాయలు విక్రయించే వారికి వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామని తెలిపారు.

2,094 corona suspects in Rachakonda
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News