Tuesday, April 23, 2024

21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: గంగుల

- Advertisement -
- Advertisement -

Gangula Kamalakar

 

కరీంనగర్: కాళేశ్వరం నీళ్లు 24 గంటల కరెంట్ సరఫరాతో పంట దిగుబడి పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 21 రోజుల్లో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయడంలేదని, పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ జరుగుతుంటే ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోఫణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి నాయకుల మాటలను రైతులు నమ్మొద్దన్నారు. కరోనా ప్రభావం రైతులపై పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని, గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామని గంగుల వివరణ ఇచ్చారు.

 

21 Lakhs metric grain purchased by Telangana Govt
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News