Home అంతర్జాతీయ వార్తలు బొగ్గు గని ప్రమాదంలో 21 మంది మైనర్లు మృతి

బొగ్గు గని ప్రమాదంలో 21 మంది మైనర్లు మృతి

21 Miners Died In Coal Mine Accident In Chinaబీజింగ్‌: చైనాలోని జిన్జియాంగ్‌ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంలో 21 మంది మైనర్లు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.  జిన్జియాంగ్‌ ఉయ్‌గుర్‌ అటానమస్‌ రీజియన్‌లో శనివారం సాయంత్రం భారీగా వరదలు వచ్చాయి. ఈ క్రమంలో చాంగ్జీ హుయ్‌ అటానమస్‌ ప్రిఫెక్చర్‌లోని హుతుబి కౌంటీలో ఉన్న బొగ్గుగనిలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన  సమయంలో గనిలో 29 మంది మైనర్లు పనిచేస్తున్నారని ప్రభుత్వ వార్తా సంస్థ చైనా డైలీ తెలిపింది. గని నుంచి 8 మందిని రక్షించారని, మరో 21 మంది మైనర్లు గల్లంతయ్యారని, వీరు మృతి చెంది ఉండొచ్చని చైనా డైలీ వెల్లడించింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేసింది.