Home జాతీయ వార్తలు పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 21మంది మృతి

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 21మంది మృతి

21 people died consuming adulterated alcohol

 

మెజిస్టీరియల్ విచారణకు సిఎం ఆదేశం

చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 21మంది మరణించారు. అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తరుణ్‌తరణ్ జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయి. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ ఈ మరణాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. జలంధర్ డివిజనల్ కమిషనర్‌కు విచారణ బాధ్యత అప్పగించారు. కల్తీ మద్యానికి సంబంధించి ఈ నెల 29 రాత్రి అమృత్‌సర్‌లోని ముచ్చల్, తంగ్రా గ్రామాల్లో మొదటి ఐదు మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర డిజిపి దినకర్‌గుప్తా తెలిపారు. గురువారం సాయంత్రం మరో ఇద్దరు ముచ్చల్‌లో మరణించారు. గురుదాస్‌పూర్ జిల్లా బటాలాలో ఇద్దరు మరణించారు. శుక్రవారం బటాలాలో ఐదుగురు, తరుణ్‌తరణ్ జిల్లాలో నలుగురు మరణించారు. కల్తీ మద్యం వల్లే వీరు మరణించినట్టు అధికారులు గుర్తించారు. కల్లీ మద్యం కేసులో ముచ్చల్‌కు చెందిన బల్వీందర్‌కౌర్‌ను అరెస్ట్ చేసినట్టు డిజిపి తెలిపారు.

21 people died consuming adulterated alcohol