Tuesday, April 16, 2024

81% పెరిగిన రికవరీ రేట్

- Advertisement -
- Advertisement -

2123 New Covid-19 Cases Recorded in Telangana

 

మొత్తం బాధితుల్లో 70 శాతం అసింప్టమాటిక్
కొత్తగా మరో 2123 కేసులు, 9 మంది మృతి
జిహెచ్‌ఎంసిలో 305, జిల్లాల్లో 1818 మందికి వైరస్
1,69,169 కు చేరుకున్న బాధితుల సంఖ్య
24 లక్షలు దాటిన కొవిడ్ పరీక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ నుంచి వేగంగా కోలుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలతో ప్రజలు ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గర రికవరీ రేట్ విపరీతంగా పెరుగుతోంది. రికవరీలో దేశ సగటు 79.26 ఉండగా తెలంగాణలో ప్రస్తుతం 81.28 శాతంగా నమోదైంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,69,169 కేసులు నమోదు కాగా వీరిలో 1,18,418(70శాతం) మందికి ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే వైరస్ సోకిందని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా శుక్రవారం 54,459 టెస్టులు చేయగా 2123 మందికి వైరస్ తేలింది. వీరిలో 305 మంది జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా,ఆదిలాబాద్‌లో 19, భద్రాద్రి 53, జగిత్యాల 53, జనగామ 28, భూపాలపల్లి 23, గద్వాల 26, కామారెడ్డి 72, కరీంనగర్ 112, ఖమ్మం 93,

ఆసిఫాబాద్ 16, మహబూబ్‌నగర్ 33, మహబూబాబాద్ 77, మంచిర్యాల 30, మెదక్ 34, మేడ్చల్ మల్కాజ్‌గిరి 149, ములుగు 20, నాగర్‌కర్నూల్ 40, నల్గొండ 135, నారాయణపేట్ 18, నిర్మల్ 23, నిజామాబాద్ 78, పెద్దపల్లి 48, సిరిసిల్లా 43, రంగారెడ్డి 185, సంగారెడ్డి 59, సిద్ధిపేట్ 87, సూర్యాపేట్ 65, వికారాబాద్ 22, వనపర్తి 26, వరంగల్ రూరల్ 29,వరంగల్ అర్బన్‌లో 81, యాదాద్రిలో మరో 41 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,69,169కి చేరగా, ప్రస్తుతం 1,37,508 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 30,636 మంది చికిత్స పొందుతుండగా వీరిలో 24,070 మంది ఐసొలేషన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1025 కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

24 లక్షలు దాటిన కొవిడ్ పరీక్షలు
రాష్ట్రంలో కరోనా టెస్టులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 24,34,409 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల మందిలో సుమారు 54,459 మందికి టెస్టులు చేస్తున్నామని వైద్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, ప్రైవేట్ కలిపి 60 ఆర్‌టిపిసిఆర్, 1076 యంటీజెన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కంటైన్‌మెంట్లు, వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఏరియాల్లో మొబైల్ వాహనాల ద్వారా ఆర్‌టిపిసిఆర్ విధానంలో టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News