Wednesday, April 24, 2024

లక్షా 70వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2137 New Covid 19 Cases 8 Deaths in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 70వేలు దాటాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,88,220 పరీక్షలు చేయగా 1,71,306 పాజిటివ్‌లు తేలినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరి కొన్ని రోజుల్లో కరోనా ఉదృతి తగ్గుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా శనివారం 53,811 మందికి టెస్టులు చేయగా 2137 మందికి వైరస్ తేలింది. వీరిలో 322 మంది జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా ఆదిలాబాద్‌లో 20, భద్రాద్రి 51, జగిత్యాల 42, జనగామ 34, భూపాలపల్లి 21, గద్వాల 27, కామారెడ్డి 60, కరీంనగర్ 132, ఖమ్మం 90, ఆసిఫాబాద్ 16,మహబూబ్‌నగర్ 28, మహబూబాబాద్ 72, మంచిర్యాల 38, మెదక్ 28, మేడ్చల్ మల్కాజ్‌గిరి 146, ములుగు 15, నాగర్‌కర్నూల్ 37, నల్గొండ 124,నారాయణపేట్ 9, నిర్మల్ 24,నిజామాబాద్ 72, పెద్దపల్లి 48, సిరిసిల్లా 57, రంగారెడ్డి 182, సంగారెడ్డి 65, సిద్ధిపేట్ 109, సూర్యాపేట్ 61,వికారాబాద్ 29, వనపర్తి 29, వరంగల్ రూరల్ 24 ,వరంగల్ అర్బన్ లో 90, యాదాద్రిలో మరో 35 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 8 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,71,306కి చేరగా, ప్రస్తుతం 1,39,700 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 30, 573 మంది చికిత్స పొందుతుండగా వీరిలో 24,019 మంది ఐసొలేషన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1033 కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

పదేళ్ల లోపు పిల్లలకు ఇన్‌ఫెక్ట్ తక్కువే…

రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్ల లోపు పిల్లలకు వైరస్ ఇన్‌ఫెక్ట్ అయ్యే అవకాశం తక్కువేనని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారిలో కేవలం 4.23 శాతం మాత్రమే చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. వీరిలో 2.26 బాలురు ఉండగా, 1.97 బాలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు బయటకు తిరగకపోవడంతో పాటు ఇమ్యూనిటీ అభివృద్ధి అయ్యే దశలో ఉండటం వలనే వైరస్‌కు ఇన్‌ఫెక్ట్ కాలేకపోతున్నట్లు వైద్యులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News