Thursday, April 25, 2024

ఆయువు తీసిన వాయువు

- Advertisement -
- Advertisement -

oxygen tanker leaked in nashik maharashtra

 

22 మంది కొవిడ్ రోగులు మృతి
ఆక్సిజన్ ట్యాంకర్ లీకవడంతో నిలిచిపోయిన ప్రాణవాయువు సరఫరా
నాసిక్ ఆసుపత్రిలో దారుణ ఘటన కలిచివేసింది : ప్రధాని మోడీ
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల సాయం : మహారాష్ట్ర సిఎం థాక్రే
ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశం

ముంబై: కరోనా వికృతపు వేళ మహారాష్ట్ర లో ఘోర విలయం చోటుచేసుకుంది. నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆసుపత్రిలో బుధవా రం మధ్యాహ్నం సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో 22 మంది క రోనా రోగులు ఊపిరిలు నిలిచిపొయి విలవిలలాడుకుంటూ మృతి చెం దారు. ఈ హృ దయవిదారక ఘటన సంబంధిత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆసుపత్రి లో దాదాపు 150 మంది కరోనా రోగులు వైర స్ తీవ్రస్థాయితో వెంటిలేటర్లపై ప్రాణాపా య స్థితి లో ఉన్నారు. ఆక్సిజన్ సకాలంలో అందితేనే వారి ప్రాణాలు నిలిచే పరిస్థితి ఉంది. అయితే అ త్యంత ఆవశ్యకపు ఆక్సిజన్ లోడ్ అనుకున్న సమయానికి ఆసుపత్రి వద్దకు చేరుకుంది, దీనిని ఆసుపత్రి వెలుపల ఆక్సిజన్ ట్యాంకర్‌లో నింపుతుండగా లీకైంది. దీనితో ఇదే దశలో లోపల ఉన్న కరోనా తీవ్రస్థాయి రోగులకు సకాలంలో అందాల్సిన ప్రాణవాయువు సరఫరా లేకుండా పోయింది.

దాదాపు అరగంట సేపు ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీనితో అ త్యంత బలహీన స్థితిలో వెంటిలేటర్లపై ఉన్న వా రిలో మరీ అత్యంత దుర్బలులు 22 మంది వా యువు లేక, శ్వా స ఆడక ప్రాణాలు వదిలారు. ఆసుపత్రి వెలుపల ఒక్కసారిగా ట్యాంకర్ లీక్ అయి, ప్రాణాధారిత ఆక్సిజన్ వాతావరణంలో విచ్చలవిడిగా సుడులు తిరిగింది. బయట అం తటా అక్కడున్న జనం ఈ గాలికి ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ సమయంలో ఆసుపత్రి లోపల క్షణాల వ్యవధిలోనే క్రమేపీ ఆక్సిజన్ సరఫరా లేకుండా వెంటిలేటర్లు ఎందుకు పనికి రాకుండా పోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. చూస్తూ ఉండగానే 20 మంది తెరిచి ఉన్న కళ్లు మూతలు పడ్డాయి. వెంటిలేటర్‌పై ఉన్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే ముంబైలో తెలిపారు.

ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. సాధారణంగా మంటలు ఆర్పేందుకు తరలివచ్చే అగ్నిమాపక శకటాలు ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రమాదం గురించి తెలియగానే అక్కడికి చేరుకుని ఆక్సిజన్‌ను నియంత్రించారు. ఆసుపత్రిలో ప్రాణవాయువు అవసరం అయిన మరో 30 మందిని వెంటనే ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రి దుర్ఘటనపై రాజకీయ నేతలు స్పందించారు. ఇంతటి దారుణ సంఘటన తాము ఇంతవరకూ చూడలేదని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఇది భయానక ఘటన అని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఇతర ఆసుపత్రులకు వెంటనే తరలించాలని, ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్‌సిపి, శివసేన, కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రమాదంపై స్పందిస్తూ ప్రకటనలు వెలువరించారు.

కలిచివేసిన ఘటన నాసిక్ విషాదంపై మోడీ, షా
నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్‌లీక్, కరోనా రోగుల మృతి ఘటనపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత హృదయ విదారక ఘటన అని, అత్యంత విషాదకరం అని ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. విచిత్ర పరిస్థితుల నడుమ జరిగిన సంఘటన అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెలుపల ఆక్సిజన్ వెలువడటం, ఆసుపత్రిలోపల ఆక్సిజన్ లేకపోవడంతో రోగులు మృతి చెందడం గురించి ప్రధాని ఆరా తీశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఘటన తనను పూర్తిగా కలిచివేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన వెలువరించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు, సొమ్మసిల్లిపోయిన పలువురు రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. నాసిక్ ఆసుపత్రి దుర్ఘటనపై మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకర పరిణామం అని తెలిపారు.

ఆక్సిజన్ ప్లాంట్‌కు అంతరాయం
ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరాచేసే ప్లాంట్‌కు లీకేజ్ ఏర్పడటం, దీనితో ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, రోగులు చనిపోవడానికి ఇదే కారణం అని నాసిక్ జిల్లా కలెక్టర్ సూరజ్ మంద్హారే తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం : ఉద్ధవ్
నాసిక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగుల మరణంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం, దీనిని రాజకీయం చేయవద్దని తాను వేడుకుంటున్నట్లు తెలిపారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో ఘటనపై సమ గ్ర దర్యాప్తు జరుగుతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ఆసుపత్రిలో 67 మంది వెంటిలేటర్లపై ఉన్న దశలో ఆక్సిజన్ సరఫరాకు అంతరా యం ఏర్పడిందని, దీని వెనుక కారణాలు లీకేజీ అంశాన్ని దర్యాప్తు క్రమంలో తేల్చుకుంటామని చెప్పారు. ఇటువంటి ఘటనలు ఇక ముందు జరగకుండా నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటామని తోపే ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News