Home తాజా వార్తలు తెలంగాణలో కొత్తగా 2,273 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,273 కరోనా కేసులు

2273 new corona cases reported telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,273 పాజిటివ్ కేసులు, 12 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. అదే సమయంలో 2,260 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,844కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 996కి పెరిగింది. ఇప్పటివరకు 1,31,447 మంది కోవిడ్ బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 30,401 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 23,569 మంది బాధితులు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కొత్తగా జిహెచ్ఎంసి పరిధిలో 325 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

2273 new corona cases reported telangana